సుస్థిర పాలన బిజెపితోనే సాధ్యం
– చంద్రుపట్ల సునీల్ రెడ్డి సుడిగాలి పర్యటన
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : దేశంలో, రాష్ట్రంలో సుస్థిర పాలన కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్య మవుతుందని మంథని శాసనసభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. శనివారం కాటారం మండలంలో బిజెపి మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి తోపాటు సునీల్ రెడ్డి ఆయా గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోడీ ప్రజా రంజక పాలనను ఆమోదిం చాలని వారు ప్రజలకు కోరారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే సుస్థిర పాలన అవసరమని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పరంగా పరిపాలన కొనసాగిస్తుందని సునీల్ రెడ్డి ప్రజలకు ఉదాహ రణలతో సహా వివరించారు. కాటారం గారి పెళ్లి మేడిపల్లి అంకుసా పూర్ కొత్త పెళ్లి తండా బయ్యారం ఇబ్రహీంపల్లి చింతకాని గ్రామాల లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు