Telangana : రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్
డెస్క్ : ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్-2023 రైతుబంధు నిధుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు సీఈసీ ఆమోదం తెలిపింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సర్కారు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సిద్ధమైంది.