గారేపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: శాసనసభకు జరగనున్న సాధారణ ఎన్నికలలో భాగంగా కాటారం పోలీస్ గారిపల్లిలో శుక్రవా రం సాయంత్రం ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. మంథని శాసనసభ నియోజకవర్గంలోని కాటారం సబ్ డివిజన్ ప్రాంతంలో ఎలాంటి ఆవాంఛనీయం సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నామని డిఎస్పి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కాటారం, మహాదేవపూర్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినట్ల యితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో కాటారం సిఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ బలగాలచే భారీ ఎత్తున కవాతు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రజలు సహకరించాలని సిఐ రంజితరావు కోరారు .