8వ వార్డులో జోరుగా నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ ప్రచారం
ములుగు, ఫిబ్రవరి 06 (తెలంగాణ జ్యోతి): ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కీ.శే. నల్లెల్ల కుమార స్వామి ఆశయాలను కొనసాగిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వచ్చిన వారి వారసులు నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కరిస్తామని, రాష్ట్ర మంత్రి సీతక్క సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. 8వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న తమకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, బీసీ సెల్ అధికార ప్రతినిధి గండ్రత్ జయాకర్, కిసాన్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి నూనెటి శ్యామ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పిట్టల రాధిక, నాయకులు వెంకటనారాయణ రెడ్డి, భూక్యా మధు, యూత్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.





