ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్‌ హయాంలోనే జరిగింది

On: February 5, 2026 8:08 PM

ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్‌ హయాంలోనే జరిగింది

ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్‌ హయాంలోనే జరిగింది

– ప్రజల విశ్వాసమే బీఆర్ఎస్ బలం

– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు, ఫిబ్రవరి5, తెలంగాణ జ్యోతి : ములుగును జిల్లా‌గా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేసోజు పద్మ వేణుగోపాలచారి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ములుగులోని రవి టీస్టాల్ వద్ద ప్రజలకు చాయ్ అందజేశారు. కారు గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ములుగు మున్సిపాలిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ గెలుపు అవసరమని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిందని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు పోరిక గోవింద్ నాయక్, అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

ములుగు జిల్లా అభివృద్ధి కేసీఆర్‌ హయాంలోనే జరిగింది

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!