మన మధ్య ఉండే మదన్ననే గెలిపిద్దాం

మన మధ్య ఉండే మదన్ననే గెలిపిద్దాం

 తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మన మధ్యనే ఉండే మదన్నని గెలిపిద్దామని భారత రాష్ట్ర సమితి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. గురువారం తెల్లవారుజామున కాటారం మండలం గూడూరులో బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సంతోషం శ్రీనివాస్ రెడ్డి, అయిత శకుంతల (తెలంగాణ శకుంతలక్క) ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. పుట్ట మధు చేపట్టబోయే ప్రత్యేక కార్యక్రమాల మేనిఫెస్టో కార్డులను ఓటర్లకు అందజేసి కారు గుర్తుకు ఓటేయాలని వారు కోరారు. అలాగే దంతాలపల్లి లో సుమారు 150 మంది వివిధ పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె వెంట నాయకులు వెంకటేశ్వరరావు, జోడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. శంకరంపల్లికి చెందిన కొంతమంది టిఆర్ఎస్ పార్టీలో పుట్ట మధు సమక్షంలో చేరినట్లు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట జనార్ధన్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment