ఆశా కార్యకర్తలతో సమీక్ష – ఎదిర పీహెచ్సీలో ఆశా డే
వెంకటాపురం, ఫిబ్రవరి05 (తెలంగాణ జ్యోతి): వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గురువారం ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల నెలవారీ రిపోర్టులను పరిశీలించారు. జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ‘స్పర్శ’ కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం గత జనవరి 30 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందని తెలిపారు. ములుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్లలో, గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్‌తో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






