బాల కుమారస్వామి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగు,ఫిబ్రవరి5,తెలంగాణజ్యోతి:ములుగుమండలం అంకన్నగూడెం గ్రామంలో నిర్వహించిన బాలకుమారస్వామి జాతరలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆలయ మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలకుమారస్వామి జాతరకు రావడం ఆనందంగా ఉందని, గ్రామంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొంటూ, బాలకుమారస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, హన్మకొండ డీఎంహెచ్ఓ డా. అల్లెం అప్పయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామస్థులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





