మహ్మద్ గౌస్‌పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత

On: February 5, 2026 3:04 PM

మహ్మద్ గౌస్‌పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత

మహ్మద్ గౌస్‌పల్లి పాఠశాలకు స్మార్ట్ టీవీల అందజేత

ములుగు, ఫిబ్రవరి6, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా పరిధిలోని ఎం.పి.యు.పి.ఎస్ గౌస్‌పల్లి పాఠశాలలో అదానీ గ్రూప్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం కింద డిజిటల్ విద్యాభివృద్ధి లక్ష్యంగా స్మార్ట్ టీవీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) సంపత్ రావు డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సాంకేతికత ఆధారిత విద్య అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, దృశ్య–శ్రవణ పద్ధతుల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకొని ఎక్కువకాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ వనరుల వినియోగం విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ములుగు జిల్లాలో విద్యార్థుల ఇంగ్లీష్ భాషా నైపుణ్యాల అభివృద్ధికి అమలవుతున్న “Learn to Read English in 90 Days” కార్యక్రమం సమర్థవంతంగా అమలుకు స్మార్ట్ టీవీలు కీలకంగా నిలుస్తాయని చెప్పారు. గత సంవత్సరం కలెక్టర్ ఆదేశాల మేరకు 8 పాఠశాలలకు అదానీ గ్రూప్ స్మార్ట్ టీవీలు అందించగా, వాటిని ఉపాధ్యాయులు సమర్థంగా వినియోగిస్తూ డిజిటల్ విద్యను అందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించిన అదానీ గ్రూప్ ప్రతినిధులకు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కి సమ్మయ్య, అదానీ గ్రూప్ ప్రతినిధులు ప్రశాంత్, శివప్రసాద్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!