మహిళామణుల ఆత్మీయ సమ్మేళనం : ఎమ్మెల్సీ పోచంపల్లి

మహిళామణుల ఆత్మీయ సమ్మేళనం : ఎమ్మెల్సీ పోచంపల్లి

 గవాక్షం నవంబర్ 22, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్ లో ములుగు పట్టణ మహిళామణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్సీ, ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ ముందుగా ఇక్కడికి వచ్చిన మహిళామణులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఒక ఉధ్యమ నాయకుడు జన్మనిస్తే మరో ఉధ్యమ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి గా ఆశీర్వాదించి మన వద్దకు పంపించాడు. నాగజ్యోతి ఎవరో కాదు ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి అడవి బాట పట్టిన దంపతుల బిడ్డ మావోయిస్టు పార్టీ అగ్ర నేతలైన బడే నాగేశ్వరరావు, అలియాస్ ప్రభాకర్ అన్న బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్కల కుమార్తె అని అన్నారు. మూడు నెలల పసి బిడ్డ ను వదిలి పోయిండ్రు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలే తల్లిదండ్రులయ్యారన్నారు. అందరు ఉన్న ఆడ బిడ్డ కు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు అట్లాంటి కష్టాలు అన్నీ దాటుకుని ఈరోజు మన ముందు నిలబడిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ను ఇక్కడి జనం మేం వెళ్ళి గ్రామాలలో తిరుగుతున్నప్పుడు కెమెరాలకు ఫోజులు ఇచ్చే అక్క అంటున్నారు. కరోనా సమయంలో సంచులు ఎత్తుకొని కూరగాయలు పంచుకుంటూ ఇచ్చిందట మీకేమైనా వచ్చినయా అట్ల సంచులు మోస్తూ బయటకెళ్ళి కోట్లు తెచ్చుకుందన్నారు. సీతక్క మీ బ్రతుకులు మారుస్తానని చెప్పి మిమ్మల్ని వాడుకొని కోట్ల రూపాయలు సంపాదించిందన్నారు. ఆడపిల్ల కడుపులో పడ్డప్పటి నుంచి పెరిగి, పెదై, వివాహం చేసుకుని తాను తల్లీగా మారే వరకు అడుగడుగునా మహిళకు అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వ మన్నారు. మహిళల సంక్షేమం, సాధికారత, భద్రతకు పెద్ద పీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో ఇప్పటికే 10 వేల ఉద్యోగాలు వచ్చాయి, రానున్న ఐదు సంవత్సరాల్లో కేటీఆర్ చొరవతో ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి లక్ష ఉద్యోగాల వరుకు ఉపాధి పొందబోతున్నారని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మహిళలకు 2కోట్లతో మహిళా భవన్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ మహిళల అభ్యున్నతి కోసం మరియు మహిళల భద్రత కోసం షీ టీమ్స్,వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతీ మహిళకు 2500 ఇవ్వనున్నారు గృహిణిల కోసం 400 ల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వనున్నాం, ఇటివలే ప్రకటించిన మేనిఫెస్టో లో అధ్బుతమైన పథకం కేసీఆర్ బీమా బీద కుటుంబానికి చెందిన వ్యక్తి అకస్మాత్తుగా ఎలా చనిపోయిన 5 లక్షల భీమా మొత్తాన్ని 11 రోజులు నిండక ముందే అందిచే గోప్ప పథకాన్ని తీసుకు రాబోతున్నామన్నారు. మహిళల సంక్షేమం కోసం మరో మానవీయ పథ‌కం సౌభాగ్య ల‌క్ష్మి ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని అర్హత కలిగిన పేద మహిళలందరికీ ప్రతినెలా రూ. 3,000 జీవన భృతి అందించనున్నాం, అంతే కాకుండా మహిళా సాధికారత కోసం కుట్టు మిషను శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా ప్రణాళిక చేయనున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న ప్రతీ మహిళ 20 నుంచి 25 వేల రూపాయలు నెలకు సంపాదించే మార్గాన్ని ఆలోచించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మండలానికి ఒకటి తీసుకురాబోతున్నాం. మీరు ఇంట్లో ఉండి నిత్యావసర వస్తువులు తయారి చేసి ఆ కంపెనీలకు ఇచ్చే విధంగా ఉపాధి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. సీతక్కకు కావాల్సింది ములుగు ప్రజలు కాదు. రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటక లో మధ్యప్రదేశ్ లో ఎక్కడ ఉంటే అక్కడ పోయి పాదయాత్ర లో పాల్గొనడం ఛత్తీస్ ఘడ్ లో కాంట్రాక్టులు చేయడం, ఆమె జాతీయ నాయకురాలు అక్కడే ఉండమందామన్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థి పేదింటి ఆడబిడ్డ బడే నాగజ్యోతిని మీ మహిళలంతా చైతన్యం తో ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ కి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రకోట సుధీర్ శ్రీదేవి యాదవ్,గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అజ్మీర దరమ్ సింగ్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోగిల మహేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment