నిరుద్యోగులు, ప్రజల సమస్యపై అసెంబ్లీలో గళం విప్పుతా.
– విద్యార్థుల రాజకీయ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి మడకం మిత్ర
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : నిరుద్యోగుల సమస్యతో పాటు ప్రజల సమస్యలు అసెంబ్లీలో గళంవిప్పి పరిష్కారానికి కృషి చేసే ప్రయత్నాల్లో భాగంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున ఇండిపెండెంట్ గా భద్రాచలం నియోజకవర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఓటర్లు నిరుద్యోగులు, విద్యార్థులు ఓటర్ లు అందరూ తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి విద్యాదీకురాలు మడకం మిత్ర కోరారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆమె భద్రాచలం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన అనుచరులను, మద్దతుదారులతో చర్చలు జరిపి, తన ఎన్నికల గుర్తు అయిన బ్యాట్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఇంటింటి ప్రచారం ద్వారా విద్యార్థుల రాజకీయ పార్టీ మేనిఫెస్టోను వినిపించాలని, ప్రచార కధన రంగంలో పాల్గోంటు న్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఒకవైపు రాజకీయాలను ప్రక్షాళన చేసే విద్యార్థుల రాజకీయ పార్టీ మరోవైపు అని ఇండి పెండెంట్ అభ్యర్థి మడకన్మిత్ర అన్నారు. ములుగు జిల్లా వెంకటా పురం మండలం మొర్ర వాని గూడెం గ్రామానికి చెందిన మడకం మిత్ర విద్యార్థుల రాజకీయ పార్టీ తరుపున నిరుద్యోగుల తరఫున భద్రాచలం నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున 60 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేసినట్టు ఆమె వెంకటా పురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు,రైతులు ,ప్రజలు ఇంకా అనేక సమస్యలు వెలుగులోకి తీసుకొస్తానని, తనను గెలిపిస్తే అసెంబ్లీలో గళం విప్పి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒక్క అవకాశాన్ని తనకు కల్పించి ఓట్లు వేసి తన ఎన్నికలు గుర్తు అయిన బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని, ఈ సందర్భంగా ఆమె అభ్యర్థించారు. అంతేకాక తన ను గెలిపిస్తే తాను అసెంబ్లీలో గళం విప్పి అనేక సమస్యలనువెలుగు లో కి తీసుకొస్తానని అన్నారు. ఈ మేరకు బాండ్ పేపర్ పై నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పై ఒటర్ లకు హామీ పత్రాన్ని సైతం ఇంటింటి ప్రచారం భాగంలో ఓటర్లకు అందజేస్తానని ఈ సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి మడకం మిత్ర తెలిపారు. ఇటీవల పేపర్ లీకేజీ ల తో అనేక మంది నిరుద్యోగులు నష్ట పోయారని తెలిపారు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వీటన్నిటికీ పరిష్కారంగా విద్యార్థుల రాజకీయ పార్టీ ఏర్పడి మార్పు కోసం గెలిపిస్తే అసెంబ్లీలో తమ వంతు తాము కృషి చేస్తామని తెలిపారు. కొద్ది రోజులు సమయం ఉన్న దని ప్రతి ఒక్కరిని కలుసుకొని తమ ఎన్నికల గుర్తు బ్యాట్ కు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ఒటర్ల విజ్ఞప్తి చేశారు.