Pradhani Modi |  ‘టీమిండియా’ ఢిల్లీకి రండి..

Pradhani Modi |  ‘టీమిండియా’ ఢిల్లీకి రండి..

– డ్రెస్సింగ్ రూంకు వెళ్లి భారత జట్టును ఓదార్చిన ప్రధాని

– సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..! 

డెస్క్ :  వరల్డ్ కప్ లీగ్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో నిరాశతో కొట్టుమిట్టాడుతున్న భారత ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంకు వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓదార్చారు. భారత్ కెప్టెన్ రోహిత్, కోహ్లి, షమీ, బుమ్రా ఇతర ప్లేయర్లతో ఆయన మాట్లాడారు. పేసర్ మహమ్మద్ షమిని ఆలింగనం చేసుకుని చాలా బాగా ఆడావ్ అంటూ కొనియాడారు. పోటీల్లో ఇలాంటివి సర్వసాధారణమని, ఎప్పుడూ మనోధైర్యాన్ని కోల్పొవద్దని సందేశమిచ్చారు. కాస్త కుదుట పడ్డాక ఓసారి టీమిండియా సభ్యులంతా ఢిల్లీకి రావాలంటూ ఆహ్వానించారు. అయితే, ప్రధాని డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లను కలిసి వీడియో ఇవాళ విడుదల కాగా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment