కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరికలు

తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ములుగు ప్రతినిధి : మండలం లోని జగ్గన్నగూడెం గ్రామం నుండి 100 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్క్ చైర్మన్ వై సతీష్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఆదివాసికి పోడు భూముల పట్టాలు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ కెసిఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే జగ్గన్నగుడెం గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయితీ, బోగ్గులవాగు వంతెన, గృహలక్ష్మి ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. జగ్గన్నగూడెం గ్రామస్తులు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కని రెండుసార్లు గెలిపిస్తే మా ఊరుకు చేసింది ఏమి లేదని, ప్రచారం తప్ప పనితనం ఏం లేదని అందుకే బిఆర్ఎస్ లో చేరుతున్నామన్నారు. చేరిన వారిలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఐలయ్య, లక్ష్మినారాయణ, సంతోష్, బాగే రాజు, గణేష్, నరేష్, చుక్కయ్య,నరేష్, కళ్యాణ్, శ్రవణ్, బబ్లూ, సున్నీ, స్వామి.శ్రీకాంత్, సారయ్య, శ్రీను, లక్ష్మి నర్సు, నారాయణ, కృష్ణ, శ్రీను లతోపాటు గ్రామస్తులు చేరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment