ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

– కలిసికట్టుగా ఉండి నాగజ్యోతిని గెలిపిద్దాం

– ములుగు ఎన్నికల ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ జ్యోతి ,నవంబర్ 18, ములుగు ప్రతినిధి : వెంకటాపూర్ మండలం ఇంచర్ల ఎం ఆర్ గార్డెన్లో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించగా ములుగు అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మండల్ ఎన్నికల ఇన్చార్జి సమ్మా రావు లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త నాగజ్యోతి గెలుపు కోసం సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాగజ్యోతి ప్రజల మనిషి ప్రజల సాధక బాధకాలు తెలిసిన నాయకురాలు ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు పగటి వేషాలతో వచ్చే వారి మాయ మాటలు నమ్మి మోస పోవద్దన్నారు. ఇదే ఉత్సాహం నవంబర్ 30 తేదీన ఎన్నికల వరకు తీసుకపోవాలని సూచించారు. నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని, మనమంతా కలిసి మరో 10 రోజులు కష్టపడి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మేనిఫెస్టోను ప్రతి గడపగడపకు తీసుకుపోయి ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయమని చెప్పాలన్నారు. ఈరోజు నుండి ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు పోయి ప్రజలను చైతన్య పరచాలి నాగజ్యోతిని 30 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెంకటాపూర్ మండలంలో ప్రపంచ యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయమును పర్యాటక అబ్బుగా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తారని అప్పుడు మండలంలోని యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్ మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా అవుతున్నారని అన్నారు. 24వ తారీఖున ములుగు జిల్లా కేంద్రంలో సీఎం ఆశీర్వాద సభ కు అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా రాష్ట్ర సీనియర్ నాయకులు ఎంపీటీసీ పరిధి క్లస్టర్ ఇన్చార్జీలు, అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు పిఎసిఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment