దానవాయిపేటలో గ్రామ దేవతల విగ్రహా ప్రతిష్ట మహోత్సవాలు.
- వెళ్ళి విరిసిన భక్తి భావం.
- తరలివచ్చిన బంధువులు భక్తులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల పంచాయతీ దానవాయి పేట గ్రామంలో నాభి శిల బొడ్రాయి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు శుక్రవారం అంగ రంగ వైభవంగా ప్రారంభమ య్యాయి. మరికాల పంచాయతీలోని వ్యవసాయ గ్రామమైన ధానవాయిపేటలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు, శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడు రోజులు పాటు నిర్వహించేందుకు, ఉత్సవ కమిటీ ఏర్పాట్లు నిర్వహించింది. దానవైపేట పొలిమేరలో నాభిశిల బొడ్రాయి ముత్యాలమ్మ దేవతలను ప్రతిష్టించేందుకు,శుక్రవారం పూజా కార్యక్రమాలను, వేద పండితుల మంత్రోఛ్ఛరణల మధ్య శాస్రోప్తంగా, సన్నాయి మేళాలు డప్పు వాయిద్యాల మధ్య గ్రామం యావత్తు ప్రజానీకం రైతులు ఆదివాసీలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల బంధువులు భక్తులు పెద్ద సంఖ్యలో దానవాఇ పేట తరలి వచ్చారు. మరికాల పంచాయతీ దానవాయిపేట గ్రామం లో భక్తిరస కార్యక్రమంతో మారు మోగుతున్నది. ఊరు పొలిమేరలో నాభి శిల బొడ్రాయి ముత్యాలమ్మ ప్రతిష్టకు సన్నాయిమేళాలతో, బోనాలతో పూజా సామాగ్రితో పెద్ద సంఖ్యలో మహిళలు గ్రామస్తులు తరలి వెళ్లారు. భూలక్ష్మి, మహాలక్ష్మి, ముత్యాలమ్మ, మదన పోచమ్మ, పోతురాజు, శ్రీ అభయాంజనేయ స్వామి మరియు గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు శుక్రు శని ఆదివారాలు ఘనంగా నిర్వహించేందు కు, వేద పండితులు ముహూర్తాలు నిర్వహించారు. ఈ మేరకు గ్రామం నడిబొడ్డున శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ఇతర దేవతల ప్రతిష్టలు మూడు రోజులు పాటు జరగనున్నాయి. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రముఖ రైతు బాలసాని శ్రీనివాసరావు, మరియు మరికాల గ్రామ సర్పంచ్ సత్యవతి పాలకవర్గం, గ్రామ రైతులు, దానవైపేట పెద్దలు,రైతులు యువకులు సమిష్టిగా గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రోజు పెద్ద ఎత్తున గ్రామ పొలిమేరల వరకు గ్రామం యా వత్తు ఊరేగింపుగా వచ్చి పేద పండితుల సూచనల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ దేవతల ప్రతిష్ట మహోత్సవాలు సందర్భంగా స గ్రామం లో భక్తిరస సందడి నెలకొన్నది. మూడు రోజులపాటు జరిగే విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా సాంప్రదాయం , కట్టుబాట్లు గ్రామం యావత్తు పాటించే విధంగా ముందుగానే భక్తి రస సమావేశాలు నిర్వహించి, దానవైపేట గ్రామస్తులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు తీర్మానించుకున్నారు. గ్రామ దేవతల ప్రతిష్ట మహోత్సవాలకు ఇతర ప్రాంతాల నుండి ప్రముఖులైన వేద పండితులను దానవాయిపేట కు పూజలకు తీసుకు వచ్చారు.