ఆదర్శ విద్యాలయంలో  ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఆదర్శ విద్యాలయంలో  ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థుల ఆనందోత్సహాల మధ్య మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి స్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో విద్యార్థులే టీచర్ల అవతారంతో స్వయంపాలన చేసి చిన్నారులకు పాఠాలను బోధించారు. అనంతరం విద్యార్థుల ఫ్యాషన్ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృషిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment