ములుగులో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
– శ్రీక్షేత్రం ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు
– భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
ములుగు ప్రతినిధి, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : పట్టణం లోని శ్రీక్షేత్రం ఆలయంలో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్ర మాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనానికి బారులు తీశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల కోలాహలంతో సందడిగా మారింది.ఉదయం 4గంటలకు ఆలయఅర్చకులు పొడిచేటి శేషాచార్యులు స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిం చారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యావహచనం వంటి సంప్రదాయ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి, 21 కలశాలతో మహా భిషేకం చేశారు. తదుపరి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శన సౌకర్యం కల్పించగా, సుమారు 500 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ముందస్తు ఏర్పాట్లు చేయడంతో దర్శనం ప్రశాంతంగా కొనసాగింది. పూజల అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ పల్లకి సేవతో 5 ప్రదక్షిణలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్తో పాటు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దాతలు, భక్తులు దంపతులుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్తో పాటు తోటా తిరుపతి, కొత్తపల్లి బాబురావు, ఓదెల రమేష్, గంధం మహేందర్, విజేందర్, ఇమ్మడి రమేష్, గొర్రె అంకుస్, ఓజ్జల లింగన్న, జనగాం బాబురావు, నూనె అశోక్, సాదు రాజు, పినగాని శ్యామ్, లింగాల శ్రీను, పోరిక రాము, శంకరయ్య, ఎలుకతుర్తి రాజన్న, జెల్లా అశోక్, ఆకుల రవి, శంకేసి జగదీష్, అక్కినపల్లి ఓం ప్రకాష్, శీలం రాము, సల్పాల శ్రీహరి, గుండ్రెటి శ్రీను, జక్కుల సాంబయ్య, పి. నగేష్ తదితర భక్తులు దంపతులుగా పాల్గొన్నారు.







