రెచ్చగొట్టే పోస్ట్లు పెడితే కఠిన చర్యలు : ఎస్సై వెంకటేష్
కన్నాయిగూడెం, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, అభ్యంతరకర పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన—గ్రామపంచాయతీ మూడో సాధారణ ఎన్నికలు 2025 సందర్భంగా మండలంలోని 11 గ్రామపంచాయతీల ప్రజలు, పార్టీల నేతలు, కార్యకర్తలు, యువత అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 17వ తేదీన జరగబోయే ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై వెంకటేష్ ఆకాంక్షించారు.






