నిరుపేద విద్యార్థులను చదివించడం ఆ దేవుడు ఇచ్చిన వరం.
- జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలీ మారుతి
మహాదేవపూర్ తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండలంలోని చదువు మధ్యలో మానేసిన నిరుపేద 15 మంది విద్యార్థులకు ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ ఫీజు చైర్మన్ అయిలి మారుతి చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిరుపేద పిల్లల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయని వీరిని చదివించడం ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరమని అన్నారు. వీరి జీవితాలు ఇక్కడనే ఆగిపోకూడదననె ఉద్దేశంతోనె వీరికి ఫీజులు చెల్లించానని, అలాగే వీరు భవిష్యత్తులో ఎంతో పైకి ఎదగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటు న్నానన్నారు. మన దగ్గర ఏమీ లేకున్నా కూడా చదువు ఒకటి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చుని చదువుతోనే పేదరికని నిర్మూలించవచ్చాని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే మీరు చదువుకోవడానికి మెటీరియల్ కూడా నేనే కొనిస్తానని చదువుకోవాలని తపన ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఇంకా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడే విద్యార్థులు ఉంటే మా ఫౌండేషన్ ని ఆశ్రయించమని తెలిపారు.
మహాదేవపూర్ మండల్ ప్రతినిధి/ఆరవెల్లి సంపత్ కుమార్.