వైద్యసేవల్లో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలి
– ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పోరిక రవీందర్
– ఉత్తమ సేవలందించిన బొల్లికుంట ఏఎన్ఎంకు అభినందనలు
వరంగల్, డిసెంబర్ 2, తెలంగాణ జ్యోతి : ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో సిబ్బంది కీలకంగా వ్యవహరించాలని ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పోరిక రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ జిల్లా పైడిపల్లి పీహెచ్సీ పరిధిలోని బొల్లికుంట సబ్ సెంటర్ ను సందర్శించిన ఆయన రోగులకు అందించిన వైద్యసేవల గురించి పరిశీలించారు. 2025–26 స్క్రీనింగ్ లో నవంబర్ నెలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏఎన్ఎం పూర్ణను అభినందించిన డాక్టర్ రవీందర్ నాయక్ తన సాలరీ నుంచి రూ.3వేలు ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగంలో సేవ చేయడం ఇష్టదైవాలకు సేవ చేసినట్లేనన్నారు. ప్రతీ ఒక్క సిబ్బంది ఆదర్శకంగా నిలవాలని సూచించారు. రోగులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. అదేవిధంగా మార్చి నెలాఖరులో ఎన్సీడీ స్క్రీనింగ్ లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబర్చుతారో వారికి సైతం ప్రోత్సాహక బహుతమతులు సొంతంగా అందజేస్తానని డాక్టర్ రవీంరద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి జులైద్ ఖాన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.







