రామాలయంలో ఆశ్చర్యం – దీపావళి రోజే పుట్టిన తొమ్మిది కుక్క పిల్లలు
ములుగు, అక్టోబర్ 20, తెలంగాణ జ్యోతి : దీపావళి పర్వదినం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని శ్రీ రామాలయంలో విశేష సంఘటన చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉండే కుక్క ఆదివారం ఉదయం తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ఆ విషయం తెలిసి ఆలయానికి వచ్చే భక్తులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. రామాలయంలో పుట్టిన తొమ్మిది పిల్లలు ఎంతో శుభప్రదమని కొందరు భక్తులు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు దీన్ని దీపావళి సందర్భంగా దైవానుగ్రహ సూచనగా భావిస్తున్నారు. ఆలయ పూజారులు, సిబ్బంది పిల్లలను సంరక్షణ లోకి తీసుకున్నారు. రామాలయంలో జరిగిన ఈ అరుదైన ఘటన స్థానికుల్లో చర్చనీయాంశమైంది.