వెంకటాపురం ఏజెన్సీలో సంపూర్ణంగా బీసీ బంద్

వెంకటాపురం ఏజెన్సీలో సంపూర్ణంగా బీసీ బంద్

వెంకటాపురం ఏజెన్సీలో సంపూర్ణంగా బీసీ బంద్

వెంకటాపురం, అక్టోబర్ 18 (తెలంగాణ జ్యోతి) : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో బీసీ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా, ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం వేకువజామున నుంచే అన్ని బీసీ సంఘాలు, అనుబంధ సంఘాలు, రాజకీయ పార్టీలు బంద్‌కి సంపూర్ణ మద్దతు తెలిపాయి. వర్తక వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, ఆయిల్ బంకులు, ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు కూడా బంద్‌కు ఐక్య మద్దతు ప్రకటించడంతో పట్టణం మొత్తం నిశ్శబ్దంగా మారింది. బీసీ సంఘాల నాయకులు “బీ.సీల ఐక్యత చాటుకుందాం — హక్కులు సాధించుకుందాం” అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్, అంబేద్కర్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఇసుక లారీలు, ఇతర వాహనాలను నిలిపివేశారు. బంద్ సందర్భంగా ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా వెంకటాపురం ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావు, శిక్షణ ఎస్‌ఐలు మరియు సిబ్బంది శాంతిభద్రతలను పర్యవేక్షించారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు సైతం నిలిచిపోయాయి. బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు కూడా మూసివేయబడ్డాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment