పాముకాటుతో రైతు మృతి — లక్ష్మీదేవిపేటలో విషాదం

పాముకాటుతో రైతు మృతి — లక్ష్మీదేవిపేటలో విషాదం

పాముకాటుతో రైతు మృతి — లక్ష్మీదేవిపేటలో విషాదం

వెంకటాపురం, అక్టోబర్16, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో పాముకాటుతో రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కేతిరి సమ్మయ్య (70) గురువారం మధ్యాహ్నం విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల సమయంలో సమ్మయ్య భార్య ఓదెక్కతో కలిసి పెద్దమ్మకుంట సమీపంలోని తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న కంకులను కోస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాము కాటేసింది. వెంటనే సమీపంలో వరి పంటకు మందు పిచికారి చేస్తున్న కుమారుడు రమేష్‌కు సమాచారం అందించగా, అతను తండ్రిని 108 అంబులెన్స్‌లో ములుగు జిల్లా కేంద్రానికి తరలించాడు. అయితే అప్పటికే విష ప్రభావంతో సమ్మయ్య మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమ్మయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, రెండేళ్ల క్రితం రెండవ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరుసగా జరిగిన ఈ దుర్ఘటనలతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎల్లప్పుడూ అందరితో కలిసిమెలిసి ఉండే సమ్మయ్య ఆకస్మిక మరణంతో గ్రామంలో దుఃఖ ఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment