వెంకటాపురంలో ఇసుక లారీ బీభత్సం – దున్నపోతు మృతి

వెంకటాపురంలో ఇసుక లారీ బీభత్సం – దున్నపోతు మృతి

వెంకటాపురంలో ఇసుక లారీ బీభత్సం – దున్నపోతు మృతి

వెంకటాపురం, అక్టోబర్13, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం – చర్ల ప్రధాన రహదారిపై ఉప్పేడు గొల్లగూడెం గ్రామ సమీపంలో సోమవారం రాత్రి ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొస్తున్న లారీ ప్రధాన రహదారిపై వెళ్తున్న దున్నపోతును ఢీకొనడం తో అది అక్కడికక్కడే మృతి చెందింది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ రాకను గమనించిన గ్రామస్థులు ఆహాకారాలు చేస్తూ రోడ్డుదిగినట్లు తెలిపారు. అయితే లారీ డ్రైవర్ వేగం తగ్గించక పోవడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. దున్నపోతు విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం లారీ అక్కడి నుండి పారిపోయిందని సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్రమ ఇసుక రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment