బయోమెట్రిక్ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి

బయోమెట్రిక్ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి

బయోమెట్రిక్ ఆధారంగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, అక్టోబర్13, తెలంగాణజ్యోతి : భూపాలపల్లి జిల్లాలో యువత శాఖలలో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగా వేతనాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో ప్రజావాణి అనంతరం సిబ్బంది బయో మెట్రిక్ హాజరు నమోదు, సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు పర్యవేక్షణ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిశీలన, ముందస్తు అనుమతులు లేకుండా సెలవులు వినియోగం తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల పనితీరు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై  అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రతి శాఖాధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులలో వెళ్లరాదని సూచించారు. సెలవు కొరకు మెసేజి చేయడం, టప్పాలో సెలవు దరఖాస్తు పంపడం చేయొద్దని నేరుగా కలిసి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏ అధికారి సెలవులో వెళ్లారో, ఫీల్డ్ కు వెళ్లారో తెలియడం లేదని పేర్కొన్నారు. అలాగే అన్ని శాఖల సిబ్బంది యొక్క బయోమెట్రిక్ నమోదును ఆధారంగా తీసుకుని వేతనాలు చెల్లించాలని ఆయ‌న స్పష్టం చేశారు. హాజరు సక్రమంగా ఉండేలా ప్రతి అధికారి పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పాఠశాలలు, అన్ని శాఖల సంక్షేమ వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులకు సందించే ఆహారం, వసతి, పరిశుభ్రత అంశాలను పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, ప్రజలకు అందే ప్రయోజనాల సమీక్ష, మరియు ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.జిల్లా అభివృద్ధి, ప్రజా సేవల విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని, అందరూ సమయపాలన, విధల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment