చిత్రకళా ఉపాధ్యాయునికి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

చిత్రకళా ఉపాధ్యాయునికి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

చిత్రకళా ఉపాధ్యాయునికి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

కాటారం అక్టోబర్ 13, తెలంగాణ జ్యోతి :  కాటారం మండల కేంద్రం లోని గిరిజన బాలల గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ కు క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది .79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెన్సిల్ గ్రాఫైట్ పై 0.4 మిల్లీమీటర్ల ఎత్తు 0.2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ప్రపంచంలోని అతి చిన్న జాతీయ పతాకాన్ని సుమారు గంటపాటు శ్రమించి తయారు చేసినందుకు గాను ముంబైలో ప్రధాన కార్యాలయం గల క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్  రికార్డ్ ప్రతినిధులు వికాస్ బొండవే, పునీత్ మాదన్ లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు . ఇంతకుముందు రజినీకాంత్ కు రెండు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులతో పాటు అంతర్జాతీయ జాతీయ అవార్డులను కూడా సాధించా రు. క్రెడిట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు గాను TGTWURJC (B),KATARAM కళాశాల ప్రిన్సిపాల్ హెచ్ .రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి మేడం, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, వార్డెన్ బలరాం ఉపాధ్యాయ ,ఉపాధ్యాయుని ,అధ్యాపక బృందం అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment