వాట్సాప్ చాట్ బాట్ ద్వారా విద్యుత్ ఫిర్యాదులు
ములుగు, సెప్టెంబర్ 8 (తెలంగాణ జ్యోతి): విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం టీజీ ఎన్పిడిసీఎల్ ఆధ్వర్యంలో ఫిర్యాదులకై వాట్సాప్ చాట్ బాట్ సదుపాయం అందుబాటు లోకి వచ్చింది. వినియోగదారులు 7901628348 నంబర్‌కు “హాయ్” పంపితే కంప్లైంట్ నమోదు, ట్రాక్, ఏజెంట్‌తో చాట్ వంటి సేవలు పొందవచ్చు. కంప్లైంట్‌కు ప్రత్యేక ID సృష్టించి SMSద్వారా సందేశం వస్తుందన్నారు. అదేవిధంగా వెబ్సైట్ www.tgnpdcl.com లో వాట్సాప్ ఐకాన్ ద్వారా, అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసు కోవచ్చని డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు తెలిపారు.