లారీ – మోటార్ సైకిల్ ఢీ – యువకుడికి తీవ్ర గాయాలు
వెంకటాపురం, సెప్టెంబర్ 8, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం పంచాయతీ పావురాల వాగు వద్ద జాతీయ రహదారి 163పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయ పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… వాజేడు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన పాయల రాంబాబు ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపు తప్పి లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రాంబాబును ముందుగా ఏటూరునాగారానికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించినట్లు సమాచారం. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.