వీవర్స్ కాలనీ గణేషుని వద్ద మహా అన్నదానం
ములుగు, సెప్టెంబర్2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో కొలువుదీరిన గణనాయకుని వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సైకం స్వరూప నరసింహారెడ్డి దంపతులు దాతలుగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ములుగు మున్సిపాలిటీ కమిషనర్ జె.సంపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బాసాని రామ్మూర్తి, కొండి రవీందర్, కందకట్ల భాస్కర్, కొండి సదానందం, మోతే శ్రీనివాస్, పౌడాల ఓం ప్రకాష్, చిందం చందు, స్నేహిత్, మహిపాల్, నామాల సాయి, మండ సిద్దు, అభిలాష్, హర్షవర్ధన్ లతో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.