నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు వర్తించవా..?

నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు వర్తించవా..?

నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు వర్తించవా..?

కన్నాయిగూడెం, ఆగస్టు 30, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రారంభించిన ఈ పథకంలో, ఇప్పటికే ఇతర ప్రభుత్వ ఫలాలు పొందిన కొందరికి మళ్లీ ఇండ్లు కేటాయించడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజమైన పేదలకు ఇళ్లు అందకపోవడం, అర్హులు కాకపోయిన వారికి ఇండ్లు కేటాయించడం పై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం స్పష్టంగా “నిరుపేద కుటుంబాలకు ఇండ్లు వర్తించాలి” అని ఆదేశిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నేతల ప్రభావంలో కొన్ని కేటాయింపులు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. “మండలంలో ఇందిరమ్మ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సభ్యులు ఎవరు? ఎంపిక ఏ ఆధారంగా జరిగింది?” అంటూ ప్రజలు మండిపడుతున్నారు. అనర్హులైన వారిని వెంటనే తొలగించి, నిజమైన అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment