ఆదివాసీ ఎరుకల కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

ఆదివాసీ ఎరుకల కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

ఆదివాసీ ఎరుకల కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

– ఎస్టీ వర్గీకరణ చేస్తేనే ఎరుకలకు న్యాయం

– ఐటీడీఏ వివక్షత పై పోరాడుతాం

– తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు

ములుగు, ఆగస్టు 30, తెలంగాణ జ్యోతి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసి ఎరుకల కులస్తులు రాజకీయంగా ఎదిగేలా ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులతో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటాలు చేశామని రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారతాయి అనుకుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కూడా ఎరుకల కులస్తుల కు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజ్యాంగంలో పొందు పరిచిన విద్య, ఉద్యోగం, ఉపాధి సంక్షేమ పథకాలు అందక ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు లేక వెనుకబడి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టిలో ఏబిసిడి వరీకరణ చేయాలని కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న డిమాండును పరిగణలోకి తీసుకొని దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రంలో ఏ బి సి డి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఐటిడిఏ వివక్ష చూపుతోందని, ఐటీడీఏ నుంచి ఎరుకుల కులస్తులకు రావాల్సి న హక్కులను సాధించుకునేందుకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఎరుకల నాంచారమ్మ ఆలయ పునరుద్ధరణతో పాటు రావాల్సిన ప్రతి హక్కును రాజ్యాంగం ప్రకారం సాధించి తీరుతామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ములుగు జిల్లా నాయకులు ఎల్ల స్వామి, పల్లకొండ భాస్కర్, పాలకుర్తి సురేష్, మేడ బంగారయ్య,భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కేతిరి సుభాష్, వరంగల్ నాయకులు ఓని సదానందం కరీంనగర్ జిల్లా నాయకుడు శ్రీను ఇతర జిల్లాల నాయకులు శ్రీరామ్, పోచయ్య, అంగిడి ప్రసాద్, రాంబాబు, పాలకుర్తి ప్రమీల సరోజన, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment