కులగణన సర్వే చేసిన సిబ్బందికి పారితోషికం అందించాలి
వెంకటాపురం,ఆగస్టు30, తెలంగాణ జ్యోతి: రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ (కులగణన) సర్వేలో ములుగు జిల్లాలో పనిచేసిన సుమారు 2,500 మంది సిబ్బందికి ఇప్పటికీ పారితోషికం అందక నిరాశ నెలకొంది. ఎన్యూమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు 12 వేల రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు షిఫ్ట్ వారీగా రూ. 750 చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడంతో సిబ్బంది 12 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాల ను వదిలి 15 రోజుల పాటు శ్రమించినా పైసా అందక నిరాశలో మగ్గుతున్నామని, వెంటనే పారితోషికం విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.