8 లక్షల విలువైన టేకు కలప పట్టివేత
వెంకటాపురం, ఆగస్టు29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు రామచంద్ర పురం గ్రామం వద్ద ఐచర్ వ్యాన్ను అటవీ సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. వాహనంలో 20 టేకు దిమ్మలు దొరికాయి. వాటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న టేకు దిమ్మలు, వాహనాన్ని వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి తరలిం చారు. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ధ్వాలియా తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ దాడిలో రామచంద్రపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంటకాల శ్రీనివాసరావు, వెంకటాపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవా, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్ దాస్, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.