ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

తెలంగాణ జ్యోతి, ఆగస్టు 30, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామానికి చెందిన చెన్నూరు స్వరూప గత రెండు నెలలుగా తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్నారు. గత వారం రోజుల క్రితం హన్మకొండలోని కూరపాటి మల్టిస్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేర్పించారు. వైద్యులు టెస్టులు నిర్వహించగా ఆమె గొంతులో గడ్డలు ఉన్నట్లు తేలింది. అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం డిశ్చార్జి చేయాలంటే ఆసుపత్రి బిల్లు రూ. లక్ష చెల్లించాలని తెలిపారు.  అయితే స్వరూప భర్త సారయ్య చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న ఈ కుటుంబానికి సహాయంగా ముప్పనపల్లి సహాయనిధిని ఆశ్రయించారు. సహాయం చేయదలచినవారు ముప్పనపల్లి సహాయనిధి అబ్బు సతీష్ – 9440226110 నంబర్ను సంప్రదించి సహాయం అందించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment