అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఎన్నిక
– అధ్యక్షుడిగా గుగ్గిళ్ల సురేష్, ప్రధాన కార్యదర్శిగా జానపట్ల జయరాజు
మంగపేట, ఆగస్టు29, తెలంగాణజ్యోతి: మంగపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో శుక్రవారం అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఎన్నికలు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ ఐలయ్య, బి. నాగరాజు, జె.బి. రాజు ఆదేశాల మేరకు నిర్వహించారు. సభాధ్యక్షులుగా పరిటి శ్రీనివాస్ వ్యవహరించగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి దిగొండ కాంతారావు, జిల్లా అధ్యక్షుడు నక్క బిక్షపతి, డివిజన్ కన్వీనర్ గుండాల రఘు, జనగాం రవి, కర్రీ శ్యాంబాబు, బండారి చంద్రయ్యల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గుగ్గిళ్ల సురేష్‌ను అధ్యక్షుడిగా, జానపట్ల జయరాజును ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా గదె శ్రీనివాసచారి (బీసీ), హైదర్ భుట్టో (మైనార్టీ), పూనం రాములు (ఎస్టీ), పూసల నరసింహారావు (ఎల్పీ), సారయ్య బాధ్యతలు స్వీకరించారు. దూలగొండ సాంబశివరావు, గోనె నాగేష్, కళల రాంబాబు, కొమరం రవికుమార్, జాడి రాంబాబు కార్యదర్శు లుగా, మూగల రాము, వంకాయల నాగేశ్వరరావు, ఎర్రవల్ల సతీష్, గడ్డం ప్రశాంత్, చెన్నూరు సాంబయ్య ప్రచార కార్యదర్శు లుగా నియమితులవగా, యాసం హరీష్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, అభ్యుదయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎన్నికైన నూతన కమిటీ, సభ్యులు మంగపేట ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిశారు.