వినాయక మండపాలను పరిశీలించిన సిఐ సురేష్, ఎస్ ఐ చల్ల రాజు
వెంకటాపూర్, ఆగస్టు 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపాలను బుధవారం ములుగు సీఐ సురేష్, వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు లు పరిశీలించారు. ఈ సందర్భంగా ములుగు సిఐ సురేష్, ఎస్సై రాజులు వినాయక మండపాల కమిటీ సభ్యులకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు ఆయా శాఖల అధికారుల సూచనలు పాటించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావివ్వకుండా చూసుకోవాలని సూచనలు చేశారు. వారి వెంట పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.