ఇష్టారాజ్యంగ కాటారం పిఎసిఎస్ లో యూరియా విక్రయాలు
కాటారం, ఆగస్టు 26, తెలంగాణ జ్యోతి : కాటారం పిఎసిఎస్ లో యూరియా పంపిణీలో నచ్చిన వారికి నచ్చిన విధంగా పంపిణీ చేస్తున్నారని సోమవారం కాటారం బిఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రామిల్ల రాజబాపు ఆరోపించారు. సామాన్య బీద రైతులకు 5, 6 ఎకరాలు భూమి ఉన్నవారికి ఒకటి, రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని, రోజు నిత్యం ఆ పేద రైతులు లైన్లో ఉంటే వచ్చిన కొద్దిపాటి యూరియా బస్తాలను అధికారంలో ఉన్నవారికి, కొందరికి అయితే 2,3 ఎకరాలు కూడా లేని వాళ్ళ పేరు మీద కూడా, తనకు నచ్చిన వారికి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారని విమర్శించారు. తంబు పనిచేస్త లేదని, అనధికారికంగా తనకు ఇష్టం వచ్చినట్లు డిజిటల్ మీటర్ పనిచేస్తలేదని ఎలాంటి రికార్డు కూడా చేయకుండా, వారి ఆటోలలో యూరియా బస్తాలు వేయించి పంపిస్తు అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా డిసిఓ ను చరవాణిలో వివరణ కోరగా, పిఎసిఎస్ కాటారంపై విచారణ చేపిస్తామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బదులిచ్చారని, బిఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రామిల్ల రాజబాపు తెలిపారు.