Elections | వెంకటాపురం మండల పరిషత్ అధ్యక్షుడు బిజెపికి రాజీనామా
- మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఎంపీపీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ శనివారం ఉదయం భారతీయ జనతా పార్టీ కి రాజీనామా చేశారు. ఆ పార్టీ అనుబంధ సంఘం రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తూ శనివారం ఉదయం వెంకటాపురంలో మీడియాకు,ప్రకటన విడుదల చేశారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యులు తాతా మధు ఆధ్వర్యంలో,శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బి.ఆర్.ఎస్. పార్టీలో చేరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాధరంగా పార్టీ లోకి ఆహ్వనించారు. వెంకటాపురం ఎంపీపీని పార్టీలోకి ఆహ్వానించి , భద్రాచలం నియోజకవర్గం పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్ల వెంకటరావు విజయం కోసం కలిసికట్టుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారిని కోరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వెంకటాపురం మండల పరిషత్ అధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు గెలుపు కోసం కారు గుర్తు విజయం సాధించేందుకు, తమ అనుచరులు కార్యకర్తలు మండల పార్టీ నాయకత్వం జిల్లా నాయకత్వం, పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించి, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావును గెలిపించుకుంటామని, ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలపరుస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆదరిస్తున్నారని, అనేకమంది వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఈసందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రచార రంగంలో పాల్గొని కారు గుర్తుకు ఓటేయాలని ప్రచార కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు మండల పరిషత్ అధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ తెలిపారు.
1 thought on “Elections | వెంకటాపురం మండల పరిషత్ అధ్యక్షుడు బిజెపికి రాజీనామా”