బ్యాంకులపై అవగాహన అవసరం
లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్
ములుగు, ఆగస్టు 12, తెలంగాణ జ్యోతి : ప్రజలు బ్యాంకుల సేవలు, ఆర్థిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ములుగు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్ సూచించారు. మంగళవారం జాకారం డీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు. బ్యాంక్ ఖాతా ఉపయోగాలు, సైబర్ క్రైమ్ నివారణ, పొదుపు ప్రాధాన్యత, ఇన్సూరెన్స్ పథకాలు (PMBSBY, PMJJBY), ఏటీఎం వినియోగం, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజనపై వివరించారు. బ్రోచర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, డీఆర్డీఏ, ఆర్డీఓ, ఎస్బీఐ ములుగు మేనేజర్, కౌన్సిలర్స్ మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.