సర్వాయిలో హత్య కేసు నిందితుడు అరెస్ట్
కన్నాయిగూడెం, ఆగస్టు 12, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామంలో జరిగిన మడి రాజబాబు (40) హత్య కేసులో నిందితుడు కొరం రంజిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో, నిందితుడి బావ ఇంటి నిర్మాణ పనులు చేసిన రాజబాబు, తనకు రావాల్సిన కూలీ డబ్బులు అడగగా, బావ ఇవ్వడానికి నిరాకరించాడు. దీనిపై రంజిత్ కోడికత్తితో రాజబాబు ప్రక్కటెముకల వద్ద పొడవగా, అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య అనంతరం పరారైన రంజిత్‌ను ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్, కన్నాయిగూడెం ఎస్సై ఈ. వెంకటేష్ ఆధ్వర్యంలోని పోలీసులు సోమవారం సాయంత్రం పట్టుకుని విచారణ జరిపి రిమాండ్‌కు తరలించారు.