కాటారంలో మహిళల ఫ్రెండ్షిప్ డే వేడుకలు

కాటారంలో మహిళల ఫ్రెండ్షిప్ డే వేడుకలు

కాటారంలో మహిళల ఫ్రెండ్షిప్ డే వేడుకలు

కాటారం, ఆగస్టు3,తెలంగాణ జ్యోతి : స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా జీవితానికి నీడనిచ్చే తోడుగా అన్నాడో ఒకవి… స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం… పాటను గానం చేస్తూ కాటారం మండల కేంద్రంలో మహిళలు ఆదివారం అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ ఒకచోట సమావేశమై శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ ను కట్టు కున్నారు. మహిళలంతా సామూహికంగా కేక్ కట్ చేశారు. స్నేహబంధంపై ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా స్నేహ బంధాన్ని విడనాడ వద్దని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు మద్దినీరజ, పవిత్రం నిర్మల, మద్ది శ్రీదేవి, మద్ది విజయలక్ష్మి కలికోట కల్పన, దారంజ్యోతి, కముటాల రాధ, పల్లెపాటి అరుణ, ఆయించ లహరి, అనంతుల అనిత తో పాటు మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment