హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఎస్సీ విద్యార్థుల అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట, ఆగస్టు1, తెలంగాణ జ్యోతి : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో (రామంతపూర్) 1వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కర్రం ఉమాపతి తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 8 వరకూ గడువు ఉందని, నారాయణపేట జిల్లాకు కేవలం ఒక సీటు మాత్రమే కేటాయించ బడిందన్నారు. ఒక్కరికి పైగా దరఖాస్తులు వచ్చినచో ఆగస్టు 10న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ నిర్వహించి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. 1వ తరగతిలో చేరదలచిన విద్యార్థుల జన్మతేది 01.06.2018 నుంచి 31.05.2019 మధ్య ఉండాలన్నారు. గతంలో కుటుంబంలో ఎవరికైనా హెచ్‌పీఎస్‌లో అడ్మిషన్ ఉన్నచో అనర్హులన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2.00 లక్షల లోపు ఉండాలన్నారు. దరఖాస్తుతో పాటు పుట్టిన తేది, కులం, ఆదాయం తదితర ధ్రువపత్రాలను జతచేయాల్సి ఉంటుందని ఉమాపతి తెలిపారు.