నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం రైతులకు చెక్కుల పంపిణీ
నారాయణపేట, ఆగస్టు 1,తెలంగాణ జ్యోతి : నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామ రైతులకు నష్టపరిహార చెక్కులు పంపిణీ చేశారు. స్వచ్ఛందంగా భూములు అప్పగించిన 11 మంది రైతులకు మొత్తం రూ.26.27 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు ఆర్డీవో రామచంద్ర నాయక్ తెలిపారు. మొత్తం 1.33 ఎకరాల భూములకు ఈ పరిహారం లభించిందన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ“ఈ ప్రాజెక్టు మా ప్రాంత రైతుల కల, ఇప్పుడు అది నెరవేరుతోందని, ప్రభుత్వం వెంటనే పరిహారం అందించడం లో చూపిన వేగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణిక రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి కుంభం శివకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివరెడ్డి, మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, ఈదప్ప, శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నేతలు వినోద్ కుమార్, రంజిత్, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.