నారాయణపేట అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.శ్రీను
నారాయణపేట, ఆగస్టు1, తెలంగాణ జ్యోతి : జిల్లా ప్రజల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కల్వకుర్తి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్.శ్రీను పదోన్నతిపై నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.