వాసవి మాతకు102కేజీల పసుపు తో అభిషేకం
నారాయణపేట ఆగస్టు1,తెలంగాణ జ్యోతి : మక్తల్ పట్టణం లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస రెండవ శుక్రవారం పురస్కరించుకొని వాసవి మాతకు 102 కేజీల పసుపుతో అభిషేకం నిర్వహించినట్లు ఆర్య వైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు మనసాని సరళ తెలిపారు. ఆలయంలో పెద్దఎత్తున ఆర్యవైశ్య మహిళామణులు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు.అనంతరం అమ్మవారికి మహా మంగళహారతి చేపట్టి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షు రాలు మన సాని సరళ మాట్లాడుతూ.. శ్రావణ మాసం మొదటి శుక్రవారం లక్ష పుష్పార్చన చేశామని, రెండవ శుక్రవారం సందర్భంగా 102 కేజీల పసుపుతో అభిషేకం చేపట్టామని, ఇక రాబోయే మూడవ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం ఉంటుందని, నాలుగవ శుక్రవారం 102 కేజీల కుంకుమతో అభిషేకం, ఐదవ శుక్రవారం ముత్యాలతో అమ్మవారికి అభిషేకం ఉంటుందని, ఆయా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం సెక్రటరీ వడ్వాట్ సుజాత, కోశాధికారి శిరీష, సభ్యులు కట్ట ఉ షారాణి, కొత్త మీరాబాయి, బోరిశెట్టి పద్మ, కల్వల ప్రసన్న, సృజన, ప్రత్యూష, లంకాల సుజాతలతో పాటు తదితరులు పాల్గొన్నారు.