సంక్షేమ పథకాలు మంజూరు చేయాలి
ఎలక్ట్రిషన్ సంఘం డిమాండ్
వెంకటాపురం, ఆగస్టు1, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో వాజేడు, వెంకటాపురం మండలాల ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌లు, టెక్నీషియన్‌లు శుక్రవారం సంయుక్త సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అమలులో ఉన్న సంక్షేమ పథకాల మద్దతుతో, వీరికి ఇందిరమ్మ ఇళ్లు సహా ఇతర పథకాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. సీనియర్ ఎలక్ట్రిషియన్ కొండపర్తి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యల పై చర్చ జరగింది. అనంతరం సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చంద్రగిరి సాగర్, శెట్టిపల్లి రమేష్, శుద్ధపల్లి గంగాధర్, మర్రి సునీల్‌లను సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఎలక్ట్రిషియన్‌లు సున్నం రమేష్, శెట్టిపల్లి వెంకటేష్, సాధనపల్లి మోహన్ రావు, తోట సతీష్, కొండ రాంబాబు, పానెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.