మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
– సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, నూతన భవనాల ప్రారంభోత్సవం.
కాటారం,ఆగస్ట్ 1,తెలంగాణ జ్యోతి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో శనివారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి విద్యుల్ల శ్రీధర్ బాబు పర్యటిస్తున్నట్లు మంత్రి పిఏ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాడిచర్ల గ్రామంలోఉదయం 8-00 గంటలకు మలహర్ రావు మండలం తాడిచెర్ల గ్రామంలో 50 లక్షల నిధులతో నిర్మించిన నూతన PACS భవనాన్ని మరియు 20 లక్షలకు నిధులతో నూతన గ్రంధాలయం భవనాన్ని, 15 లక్షలతో సిసి రోడ్లను, ప్రారంభోత్సవం, తహశీల్దార్ ఆఫీస్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేస్తారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం లో ఉదయం 9-00 గంటలకు ఎగ్లాస్ పూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో నూతనంగా 2కోట్ల 70 లక్షలతో నిర్మించే బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9-30 నిమి..లకు మంథని మున్సిపాలిటీ పరిధిలో 6 కోట్ల 70 లక్షలతో నిర్మించిన మంథని పెట్రోల్ బంక్ ఏరియా, పెద్దపల్లి రోడ్డు, గోదావరిఖని రోడ్డు నూతనంగానే నెలకొల్పబడిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభిస్తారు. ఉదయం 10-00 గంటలకు సింగరేణి సి ఎస్ ఆర్ కింద పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్స్ మెటీరియల్స్ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ లోని Govt హైస్కూల్ లో మంత్రి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయనున్నారు, అటవీ శాఖ & మునిసిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10-30నిమి..లకు మంథని మండల పరిషత్ కార్యాలయం వద్ద నమూనా ఇందిరమ్మ ఇంటిని, మంథని మునిసిపాలిటీలో త్వరలో 20 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రతి లబ్ధిదారునికి ఐదు లక్షల ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నిర్మించబోతున్న 410 గృహాలకు పైలాన్ శంకుస్థాపన, మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అక్కడే ఉపాధి హామీ పథకం నిధుల నుండి నూతన గ్రామపంచాయతీ భవనాలకు కోటి 40 లక్షలతో మంథని మండలంలోని అడవి సోమనపల్లి, ఖానాపూర్, మల్లేపల్లి, అరెంద, గోపాల్ పూర్, ఉప్పట్ల, తోటగోపయ్యపల్లి గ్రామపంచాయతీ నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 11-00 గంటలకు మంథనిలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నూతన ఎన్నిక కాబడిన వ్యవసాయ కమిటీ చైర్మన్ & పాలకవర్గం సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 12-00 గంటలకు మంథని, గంగాపురి వద్ద ఆర్ఆర్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంథని , రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ నాలుగు మండలాల లబ్ధిదారులకు మరియు అన్ని మండల 308 సి ఎం ఆర్ ఎఫ్ కోటి 8లక్షలు విలువ చేసే చెక్కులు,14 కల్యాణ లక్ష్మి చెక్కుల లబ్ధిదారులకు మంథని ఆర్ ఆర్ గార్డెన్ లో మంత్రి చేతుల మీదుగా అందజేయనున్నారు. అక్కడే ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో నిర్వహించి సెలబ్రేషన్ లో పాల్గొంటారు.మధ్యాహ్నం 2-00 గంటలకు రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో 2 కోట్ల 60 లక్షల నిధులతో నిర్మించిన కల్వచర్ల నుండి లొంక కేశారం వరకు CC రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నారు.మధ్యాహ్నం 3-00..గంటలకు కమాన్ పూర్ లోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నూతన ఎన్నిక కాబడిన వ్యవసాయ కమిటీ చైర్మన్ & పాలకవర్గం సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.