విద్యుత్ షాక్‌తో పంచాయతీ కార్మికుడి మృతి
వెంకటాపురం, ఆగస్టు 1, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం శివారులోని బీసీ మరిగూడెం పంచాయతీకి చెందిన పంప్ ఆపరేటర్ మడకం విజయ్ (35) శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తగలడంతో స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు. విజయ్ శాంతినగర్‌లో నివాసముండి అనేక సంవత్సరాలుగా పంచాయతీలో విధులు నిర్వర్తిస్తూ, ప్రజలతో మమేకమై సేవలందిస్తూ ఉన్నారు. మృదు స్వభావంతో అందరినీ పలకరించే విజయ్ అకస్మాత్తుగా మృతి చెందడంతో పంచాయతీ కార్మికులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విజయ్ మృతి వార్త వినగానే స్థానికులు పెద్ద సంఖ్యలో వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలి వచ్చారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.