వెంకటాపురం సర్కిల్ పరిధిలో ముమ్మర వాహనాల తనిఖీలు
వెంకటాపురం, జూలై 31, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం జాతీయ రహదారిపై, ఎస్‌ఐ జి. కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలు, ప్రయాణికులను విస్తృతంగా తనిఖీ చేశారు. వెంకటాపురం పీఎస్ పరిధిలోని నూగూరు గ్రామ సమీపంలో ఎస్‌ఐ కె. తిరుపతిరావు నేతృత్వంలో శిక్షణలో ఉన్న ఎస్‌ఐలు సాయికృష్ణ, తిరుపతిరెడ్డిలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి ప్రయాణికుల వివరాలను సేకరించారు. ఏవైనా అనుమానాస్పద చట్టవిరుద్ధ కార్యక లాపాలు కనిపించి నట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఆర్పీఎఫ్ మరియు సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.