కొండారెడ్డిపల్లి చెరువు ఆయకట్టు రైతులకు నీరు విడుదల
నారాయణపేట,జూలై31,తెలంగాణ జ్యోతి : నారాయణపేట మండలంలోని కొండారెడ్డి పల్లి చెరువు నీటిని ఆయకట్టు రైతుల వినతిపై అధికారుల ఆమోదంతో విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు వరి సాగు ప్రారంభించేందుకు అవసరమైన నీరు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతీయ కిసాన్ సంఘం తరఫున సహకరించిన తహసిల్దార్, ఇతర అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.